అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా! | Rekha Boj Emotional Story: “I’ll Sell My Kidney But Won’t Quit Acting” | Sakshi
Sakshi News home page

Rekha Boj: కమిట్మెంట్‌ ఇస్తే బంగ్లా రాసిస్తా! 4 ఏళ్లుగా బిగ్‌బాస్‌ కోసం ట్రై చేస్తున్నా!

Oct 17 2025 1:18 PM | Updated on Oct 17 2025 1:34 PM

Actress Rekha Boj about Bigg Boss Show and Movies

బోల్డ్‌ సినిమాల్లో నటించి పాపులర్‌ అయింది వైజాగ్‌ బ్యూటీ రేఖా భోజ్‌ (Rekha Boj). సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్‌ చేస్తోంది. ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి.. పాట కవర్‌ సాంగ్‌ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది. అంతటితో ఆగడం లేదు.. కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్‌ను మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్తోంది.

షార్ట్‌ఫిలింతో జర్నీ మొదలు
రేఖా భోజ్‌ మాట్లాడుతూ.. నా ఫస్ట్‌ షార్ట్‌ ఫిలిం 'లవ్‌ ఇన్‌ వైజాగ్‌'. షణ్ముఖ్‌ జశ్వంత్‌తో కలిసి యాక్ట్‌ చేశాను. తర్వాత డర్టీ పిక్చర్‌ అనే లఘు చిత్రం చేశాను. కాలాయా తస్మై నమః సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాను. నా జీవితంలో ఫస్ట్‌ కవర్‌ సాంగ్‌ సామి సామి.. బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను. ఈ సాంగ్‌ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్‌ వచ్చింది. ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది.

కమిట్మెంట్స్‌ ఇచ్చుంటే..
గత ఐదారేళ్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్స్‌ అడుగుతున్నారు. బంగ్లా రాసిస్తా.. అవి కొనిస్తా.. అదీ ఇదీ అని మభ్యపెట్టేవారు. కమిట్మెంట్‌ అడిగినవాళ్లకు గట్టిగానే కౌంటర్లిచ్చాను. అలాంటివి చేసుంటే ఈపాటికి చాలా సంపాదించేదాన్ని. నేనేదో.. నా దగ్గరున్న వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేను. నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే.. ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. గాజులమ్మగా వచ్చిన రూ.4 లక్షలతో సామి సామి పాట ఎలా చేశానో.. కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకుంటున్నా.. 

నాలుగేళ్లుగా బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు..
ఎందుకంటే సినిమానే నా ప్రపంచం. ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show)కి వెళ్లేందుకు ప్రయత్నించాను. గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. అంతా ఓకే అన్నారు.. ఇంకో వారంలో షో స్టార్ట్‌ అన్న సమయంలో రిజెక్ట్‌ చేశారు. ముక్కూమొహం తెలియనివాళ్లు కూడా షోకి వస్తున్నారు. మరి నన్నెందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్‌కు సైతం వీడియో పంపించాను. కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని రేఖా బోజ్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: ఈసారి ఇద్దరు కెప్టెన్స్‌.. సుమన్‌ ప్రమాణ స్వీకారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement