ఈసారి ఇద్దరు కెప్టెన్స్‌.. సుమన్‌ ప్రమాణ స్వీకారం! | Bigg Boss 9 Telugu: Suman Shetty, Gaurav New Captains of BB House | Sakshi
Sakshi News home page

ఈ బంధం ఆగనిది.. సుమన్‌ అంటే ఫ్లవర్‌ అనుకుంటిరా.. వైల్డ్‌ ఫైర్‌!

Oct 17 2025 10:38 AM | Updated on Oct 17 2025 1:01 PM

Bigg Boss 9 Telugu: Suman Shetty, Gaurav New Captains of BB House

దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్‌ 16) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

నా ఆరోగ్యం పాడైపోతోంది
లైట్లు ఆఫ్‌ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్‌ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్‌ పెట్టింది మాధురి (Divvala Madhuri). ఇదేమైనా బిగ్‌బాస్‌ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్‌ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు... నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.

దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్య
ఇక రమ్య ఆర్డర్‌ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్‌బాస్‌. సుమన్‌తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్‌గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్‌.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్‌ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.

ఏడ్చేసిన భరణి- దివ్య
చెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్‌ చేసేంత సీన్‌ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్‌బాస్‌ వైల్డ్‌కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్‌ చేసుకుని గేమ్‌ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్‌షిప్‌ కాపాడుకోవాలన్నారు. 

ఇద్దరు కెప్టెన్స్‌
అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్‌ (Suman Shetty)ను ఎంపిక చేసుకుని బాల్‌ టాస్క్‌ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్‌, శ్రీనివాస్‌.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్‌ కార్డులతో పాటు చివరి వరకు సుమన్‌ నిలిచి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు. సూపర్‌ పవర్‌ ఉన్న నిఖిల్‌ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్‌ ఈపాటికే అయిపోయింది. గౌరవ్‌, సుమన్‌ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్‌ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం!

చదవండి: సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement