breaking news
Gaurav Gupta
-
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
బిగ్‌బాస్ నుంచి 'గౌరవ్' ఎలిమినేట్.. రెమ్యునరేషన్ కూడా తక్కువే
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా గౌరవ్ హౌస్ నుంచి వచ్చేశాడు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ కావడం విశేషం. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఎలిమినేషన్ రౌండ్లో చివరి వరకు దివ్య, గౌరవ్ ఉంటే ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌరవ్ హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, తన రెమ్యునరేషన్ కూడా ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే కాస్త తక్కువేనని తెలుస్తోంది.అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి గౌరవ్ ఎంట్రీ వచ్చాడు. అయితే, అతడికి వారానికి రూ. 1.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.7.5 లక్షల మేరకు సంపాదించాడు. ప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ గౌరవ్ నటిస్తున్నాడు. అతనితో పాటు ఎలిమినేట్ అయిన నిఖిల్ ఐదువారాలకు రూ. 12 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్ల తెలుస్తోంది.తనూజ సేవింగ్ పవర్ఆదివారం ఎపిసోడ్లో భాగంగా ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరూ చివరి వరకు మిగిలారు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్‌ను ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగుతూ అది ఈ వారంతో ఎక్స్పెయిర్ అవుతుందని గుర్తుచేస్తారు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అవుతుందని క్లారిటీ ఇస్తారు. అప్పుడు మాత్రమే గౌరవ్ సేఫ్ అవుతాడని కండీషన్ పెడుతారు. దీంతో తనూజ కొంత సమయం ఆలోచించి ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్‌ను గౌరవిస్తున్నానంటూ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్‌ను వాడటం లేదని చెప్పడంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అలా దివ్య కూడా సేఫ్ అయిపోయింది. -
'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్‌కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్‌లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూఅయితే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. ఎమోషనల్ డ్రామా ఎక్కువైందిరీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్ -
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
రెండు రోజులుగా ఎపిసోడ్స్ చూస్తుంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) నిద్రమత్తులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఏదో టాస్కులిచ్చామా? ఆడించామా? అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు.. అసలైన రెబల్‌ను వదిలేసి ఎక్కువమంది రెబల్ అనుకునేవ్యక్తిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడమైతే మరీ దారుణం. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..గొడవకు సైపాత రెబల్స్ దివ్య (Divya Nikhita)-సుమన్‌కు ఇచ్చిన పని పూర్తయిందన్నారు. తర్వాత రీతూను కొత్త రెబల్‌గా నియమించి ఒకరితో సీరియస్‌గా గొడవపడమన్నాడు. ఇంకేముంది.. ఇమ్మూతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకర్ని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దాని సాయంతో ఆమె సాయిని తీసేసింది. ఏ గేమ్ పెట్టినా గెలుపు మాత్రం ఆరెంజ్ టీమ్‌దే అన్నట్లుగా ఉంది పరిస్థితి. గౌరవ్‌కు బ్యాడ్జ్..మొన్న జరిగిన రెండు టాస్కుల్లో వీరే గెలిచారు. నిన్నటి టాస్కులో ఇమ్మూ, గౌరవ్ ఆడి మరోసారి టీమ్‌ను గెలిపించారు. ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ నాక్కావాలని గౌరవ్ అడిగితే మొదట్లో కుదరదని వాదించారు. కానీ, చివరకు సరేనని ఇచ్చారు. బంధాల వల్లే బయటకు వెళ్లిన భరణి లోపలకు వచ్చాక కూడా పెద్దగా మారలేదు. దీంతో నాగార్జున క్లాస్ పీకడంతో కాస్త బుద్ధి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాన్ని కాస్త ధైర్యంగా చెప్తున్నాడు. నన్ను బెదిరించేవాడే లేడురెబల్ ఎవరనుకుంటున్నారు? అన్న చర్చలో సంజనాయే అని అనుమానపడ్డాడు. తను మీకు చెప్పిందా? అని దివ్య అడగ్గా.. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే అని కల్యాణ్ రెచ్చగొట్టాడు. అందుకు భరణి.. నేను వెళ్లిపోయినా పర్లేదు, హౌస్‌లో నన్ను బెదిరించేవాడే లేడు. వాడు రెబల్ అయినా.. రెబల్‌కు బాబు అయినా! ఆల్రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని.. అంటూ డైలాగ్ కొట్టాడు.సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్తర్వాత రీతూకు.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటో కొట్టేయమని మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ రీతూ పూర్తి చేయలేదు. తర్వాత బిగ్‌బాస్ అందర్నీ కూర్చోబెట్టి ఎవరు రెబల్ అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఎక్కువమంది గౌరవ్ పేరు చెప్పడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే బిగ్‌బాస్ రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని కంటెండర్లుగా ప్రకటించారు. కొత్త కెప్టెన్ ఎవరంటే?సంజన, నిఖిల్, గౌరవ్, డిమాన్, సాయి, కల్యాణ్ రేసులో నుంచి ఇదివరకే ఔట్ అయిపోగా తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూ మిగిలారు. వీరిలో నలుగురికే ఛాన్స్ అనడంతో రాము తాను తప్పుకుంటానని ముందుకొచ్చాడు. అలా కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ, దివ్య, సుమన్ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
డిమాన్ పవన్ టాస్క్‌ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్‌మేట్స్‌కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్ ఔట్రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్‌లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. నిఖిల్‌ను తప్పిస్తున్నట్లు చెప్పింది.కెప్టెన్‌కు ఎదురుతిరిగిన గౌరవ్పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్‌గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్‌లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్‌కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్‌ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్‌కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు. భోజనమే ఉండదుఈ గొడవ ముదరడంతో.. గౌరవ్‌ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్‌బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు. దెబ్బకు జడుసుకున్న రీతూఅనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్‌లో తనూజ గెలిచింది.చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి -
ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం!
దివ్వెల మాధురి బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా ఆరోగ్యం పాడైపోతోందిలైట్లు ఆఫ్ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్ పెట్టింది మాధురి (Divvala Madhuri). ఇదేమైనా బిగ్‌బాస్ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు... నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్యఇక రమ్య ఆర్డర్ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్‌బాస్. సుమన్‌తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్‌గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.ఏడ్చేసిన భరణి- దివ్యచెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్‌బాస్ వైల్డ్‌కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నారు. ఇద్దరు కెప్టెన్స్అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్ (Suman Shetty)ను ఎంపిక చేసుకుని బాల్ టాస్క్ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్, శ్రీనివాస్.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్ కార్డులతో పాటు చివరి వరకు సుమన్ నిలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సూపర్ పవర్ ఉన్న నిఖిల్ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఈపాటికే అయిపోయింది. గౌరవ్, సుమన్ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం!చదవండి: సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే! -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్‌ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్‌మేట్స్‌తో తలపడి గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్‌తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్‌గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్‌కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
అతిలోక సుందరిలా జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. మనసు దోచేసే అందం (ఫొటోలు)
-
10వేల క్రిస్టల్స్, ఐవరీ వైట్ లెహంగాలో జాన్వీ డాజ్లింగ్ లుక్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌ను ముంబైలో ఆవిష్కరించారు ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్గా అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్ గుప్తా ఇన్‌స్టాలో షేర్ చేశారు.ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో అద్భుతమైన లుక్‌లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. గౌరవ్‌తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు డైమండ్ ఆభరణాలతో దేవకన్యలా మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్ చేశారట. అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్‌లో కూడా ఈ బ్రైడ్ల్ షోలో సందడి చేసింది. (పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?) View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) ఈ ఇంకా షోలో డైరెక్టర్ కిరణ్‌రావు, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్ దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని -
Paris Fashion Week 2025: ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్
-
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్ గౌరవ్‌గుప్తా ప్రత్యేక కలెక్షన్‌తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని ఫ్యాషన్ వీక్‌లో తన దుస్తులను ప్రదర్శించాడు. భార్య నవ్‌కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే 'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా కోచర్ కలెక్షన్‌ను ప్రదర్శించాడు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా కలెక్షన్‌కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది తెలుసుకుందాం.ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్, నవ్‌కిరత్ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్‌కిరత్ దాదాపు మరణానికి చేరువైంది. ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది. ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి గౌరవ్ కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని అటెలియర్ ధ్వంసమైంది. కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. కట్ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్‌తో ప్యాషన్వీక్లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా పాల్గొనలేకపోయాడు. కానీ ఈ సారి వేగంగా పుంజుకని తన స్టైల్‌తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్‌కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్ వీక్ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)ఈ ఈవెంట్లో నవ్‌కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్‌వేపై వాక్ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్‌ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో పేర్కొన్నాడు. నవ్‌కిరత్ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు. View this post on Instagram A post shared by The Wedding Collective (@theweddingcollectiveofficial)దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్‌గుప్తా. తాజా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్‌లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన లేబుల్‌ని స్థాపించాడు. తరువాత ఇస్తాంబుల్‌లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్‌ను ప్రారంభించాడు.2006లో ఇండియా ఫ్యాషన్ వీక్‌లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా ప్రశంసలందుకున్నాడు.2009లో, తన తొలి స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు. ముంబై,హైదరాబాద్, కోల్‌కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్షిప్ స్టోర్లున్నాయి.2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్‌తో కలిసి పనిచేశాడు. 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు హైలైట్ అయ్యాయి.2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్‌లో గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్‌బింగ్ ధరించడం విశేషం. ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
తళుక్కుమని మెరిసిపోతున్న కృతి శెట్టి (ఫోటోలు)
-
అమ్మకాల్లో పావు వంతు ఈవీలే
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్‌లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు. కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే.. జడ్ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్‌తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్‌షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్‌లో ఇదే చవకైన ఈవీ. -
Zomato: జొమాటోలో అనూహ్య పరిణామాలు
Gaurav Gupta Quit Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలన్నీ చూసుకునే గౌరవ్ గుప్తా(38).. కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా హౌజ్‌లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ పరిణామంతో జొమాటో షేర్లు స్వల్ఫంగా పతనం అయ్యాయి. ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటోలో కీలక నిర్ణయాల నుంచి, ఐపీవోకి వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ లాంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే ఇంతకాలం చూసుకున్నారు. ఇదిలా ఉంటే జొమాటో ఐపీవో వెళ్లిన రెండు నెలల తర్వాత.. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే గౌరవ్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Zomato IPO.. సినిమా చూపిస్తారంట! కాగా, గౌరవ్ జొమాటో నుంచి బయటకు వచ్చేయడం వెనుక కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం జొమాటోలో ఆయన ఆఖరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా ఆయన ఉద్యోగుల్ని ఉద్దేశించి మెయిల్ పెట్టినట్లు సమాచారం. ఆరేళ్ల జొమాటోతో తన ప్రయాణం ముగిసిందని, ఇంక కొత్త జర్నీ ఆరంభించబోతున్నట్లు ఆయన పేరు మీద ఒక ప్రకటన వైరల్ అవుతోంది. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారం రెండూ గౌరవ్ ఐడియాలే. పైగా ఓవర్సీస్లో జొమాటో విస్తరణ కూడా ఆయన అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే గుప్తా.. 2015లో జొమాటోలో చేరగా.. 2018 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా వ్యవహరిస్తుండగా.. 2019లో ఆయనకు జొమాటో ఫౌండర్ హోదా దక్కింది. జొమాటో నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో సొంతంగా మరేదైనా స్టార్టప్ ప్రారంభిస్తారా? అనే చర్చ అప్పుడే మొదలైంది. చదవండి: జొమాటో ప్రస్థానం.. ఇలా మొదలైంది! -
మీరు చూసింది ట్రైలరే, నేను ఏకంగా సినిమా చూపిస్తా
న్యూఢిల్లీ: రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో ప్రారంభమైన జొమాటో ఐపీవోలో రికార్డ్ స్థాయిల్ని క్రియేట్ చేస్తోంది. అమెరికా, చైనాలో ఫుడ్ డెలివరీ సంస్థ ఐపీఓల కంటే భారత్ కు చెందిన జొమాటో ఐపీఓ మార్కెట్లో సత్తా చాటుతోంది. జొమాటో ఇష్యూ ప్రైస్‌బాండ్ ఒక్కో షేరుకు రూ.72-76గా నిర్ణయిస్తూ రంగంలోకి దిగిన జొమాటోకి ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. బీఎస్ఈ లెక్కల ప్రకారం జొమాటో ఐపీవో రెండో రోజు ఇప్పటి వరకు ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ 98శాతం సబ్ స్క్రిప్షన్ (నమోదు) , నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 13శాతం, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు.3.62 శాతం, ఉద్యోగులు 18శాతం మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జొమాటో ప్రతినిథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఓ ప్రారంభానికి ముందే సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశానంటూ గోయల్ ట్వీట్ చేయడం వ్యాపార దిగ్గజాలు స్పందిస్తూ తమదైన స్టైల్లో గోయల్‌కి అభినందనలు చెప్పారు. గోయల్‌కు అభినందనలు వెల్లువెత్తుతుంటే జొమాటో కో ఫౌండర్ గౌరవ్ గుప్తా అభి బాకి హై మేరీ దోస్త్ అంటూ "ఇప్పటి వరకు మీరు చూసి కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా చూపిస్తానంటూ ఓ టీవీ చర్చా వేదికలో డైలాగ్స్ పేల్చారు. ఆ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఐపీఓలో ఊహించని విధంగా జొమాటోకి విశేష స్పందన లభించడంతో ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు సైతం ఐపీఓల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి అవి ఏమేరకు ఫలితాల్ని సాధిస్తాయో వేచి చూడాల్సి ఉంది. చదవండి: వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
లోన్ కావాలా నాయనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం విషయంలో సిబిల్ స్కోర్, బ్యాంక్ బ్యాలెన్స్, స్టేట్మెంట్ ప్రతి ఒక్కటీ కౌంట్ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా సామాన్యులకు, ఎస్ఎంఈలకు రుణాలు రావు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది గుర్గావ్కు చెందిన మైలోన్‌కేర్.ఇన్. దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం చేసుకొని గృహ, బంగారు, వ్యాపార వంటి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ గౌరవ్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి.. ‘‘ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, మణప్పురం, టాటా క్యాపిటల్ వంటి 24 బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వడ్డీ రేట్లు లోన్‌ను బట్టి 8.65 శాతం నుంచి 13.50 శాతం వరకున్నాయి. గృహ, వ్యక్తిగత, బంగారు, ప్రాపర్టీ, వ్యాపారం వంటి అన్ని రకాల రుణాలతో పాటూ ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్ క్రెడిట్ కార్డులను కూడా అందిస్తాం. రూ.5 వేల నుంచి రూ.25 కోట్ల వరకు రుణాలుంటాయి. ప్రస్తుతం 25 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 శాతం మంది ఉంటారు. ఈ ఏడాది రూ. 2,500 కోట్ల రుణాల లక్ష్యం.. కస్టమర్లు మైలోన్‌కేర్‌లో లాగిన్ అయి కావాల్సిన రుణ విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు, రుణ అవసరాలను తెలిపితే.. ఆల్గరిథం ద్వారా కస్టమర్లకు 2–3 రకాల బ్యాంక్ రుణ అప్షన్లను ఇస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి కస్టమర్ తనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల రుణాలను అందించాం. ఈ ఏడాది రూ.2,500 కోట్ల రుణాలను అందించాలని లక్షి్యంచాం. ప్రస్తుతం నెలకు లక్ష ఎంక్వైరీలు వస్తున్నాయి. రుణాన్ని బట్టి 0.5 నుంచి 3 శాతం వరకు కమీషన్, మార్కెటింగ్ ఫీజు ఉంటుంది. ప్రతి ఏటా 40 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది 150 శాతాన్ని లక్షి్యంచాం. మా మొత్తం ఆదాయంలో 17 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నదే. ఎంఎఫ్, ట్యాక్స్ ప్లానింగ్‌లోకి.. ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తాం. సేల్స్, టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. ఎన్‌క్యుబేట్ క్యాపిటల్ వెంచర్, ఎస్ఏఆర్ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ‘‘త్వరలోనే డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లు, యాప్ ఆధారిత పర్సనల్ లోన్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ ప్లానింగ్ విభాగాల్లోకి విస్తరిస్తామని’’ గౌరవ్ వివరించారు. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన నటి
ముంబై: 'బిగ్‌బాస్-9' పోటీదారు, మోడల్, నటి మందనా కరిమీ భర్త గౌరవగుప్తాపై గృహహింస కేసు నమోదు చేసింది. వీరు గత జనవరి 25న పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు తిరగకముందే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన జీవనవ్యయానికిగాను భర్త గౌరవ్ ప్రతి నెలా రూ. 10 లక్షలు చెల్లించాలని, తనను మానసికంగా వేధించి క్షోభకు గురిచేసినందుకు, తన కెరీర్‌కు, బిజినెస్‌కు నష్టం కలిగించినందుకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను హిందూమతంలోకి మారాల్సిందిగా భర్త గౌరవ్ ఒత్తిడి తెచ్చాడని, పెళ్లయిన తర్వాత నటనను వదిలిపెట్టాలని, ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఇరాన్‌కు చెందిన ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అత్త కూడా తనను వేధించినట్టు ఆమె తెలిపారు. 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తవాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అని ఆమె మీడియాకు తెలిపింది. ఈ వ్యవహారాన్ని కోర్టు ఆదేశాల ప్రకారమే తేల్చుకుంటామని ఆమె లాయర్ చెప్పారు. ఈ విషయమై స్పందించడానికి గౌరవ్ గుప్తా పీఆర్ నిరాకరించారు. -
‘పాషాణం’ కరిగిన వేళ..
న్యూఢిల్లీ: ‘గౌరవ్ గుప్తా ఒక బ్యాంక్ ఉద్యోగి.. మధ్యాహ్నం ఒక ఎయిర్ కండిషనింగ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.. వెయిటర్ వచ్చి వినయంగా అభివాదం చేసి ఏంకావాలో ప్రశ్నించాడు.. ఆయన ‘తాలి’ ఆర్డర్ ఇచ్చారు.. పదినిమిషాల్లో రోటీ, అన్నం,రెండు కూరలు, చెట్నీ, పెరుగు తో కూడిన భోజనాన్ని వెయిటర్ తీసుకువచ్చి గుప్తా ముందుంచాడు..’ ఇదంతా చదవడానికి సాదాసీదాగా ఉందికదూ.. కాని ఆ వెయిటర్ ఎవరో తెలుసా.. తీహార్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరస్తుడు..ఇప్పుడర్థమైందా ఆ హోటల్ ప్రత్యేకత.. ఇందులో క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకూ అన్ని పనులూ ఖైదీలే నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఖైదీలకు పునరావాసం కల్పించే దిశలో జైలు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ‘తీహార్ ఫుడ్ కోర్ట్’ను జూలై మొదటి వారంలో ప్రారంభించారు. ఇది తీహార్ జైలులోని ఖైదీల విడిదికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఈ హోటల్లో మొత్తం ఫర్నిచర్‌ను ఖైదీలో తయారుచేశారు. 50 మంది ఒకేసారి కూర్చోగలిగేంత విస్తీర్ణం ఉన్న ఈ హోటల్లో ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.. హోటల్‌కు వచ్చిన వినియోగదారులతో ఎలా మసులుకోవాలనే విషయమై వెయిటర్లకు జైలుకు దగ్గర్లోనే ఉన్న ఒక హోటల్ మేనేజమెంట్ స్కూల్ శిక్షణ ఇచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి చెందిన ఆహారమే దొరుకుతుంది. రూ.150కు డీలక్స్ తాలి దొరుకుతుండగా, అతి చౌకగా సమోసాలు కేవలం రూ.10కు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ హోటల్ మేనేజర్ మహమ్మద్ అసిమ్ మాట్లాడుతూ రోజూ ఇక్కడ 50 మంది వరకు వినియోగదారులు వస్తుంటారన్నారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి రోజుకు రూ.74 లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి తమ హోటల్‌కు వచ్చి భోజనం చేసిన కస్టమర్ మళ్లీ భోజనానికి రావాల్సిందే..’ అంటూ అసిమ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ అసిమ్ ఒక హత్య కేసులో తీహార్ జైలులోనే 14 ఏళ్ల 6 నెలలపాటు శిక్షను అనుభవించాడు. కనీసం హైస్కూలు చదివి, 12 శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నవారెవరైనా ఈ హోటల్లో పనిచేసేందుకు అర్హులే. పారిపోవడానికి అంతగా ఆసక్తి చూపించరని ఇంకా రెండేళ్లలోపు శిక్షా కాలం ఉన్నవారికే ఈ హోటల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. వారికి మరింత నమ్మకం కలిగించేందుకు ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా జైలు నుంచి సైకిల్ పైనైనా, లేదా నడుచుకుంటూ హోటల్‌కు వెళ్లేందుకు జైలు అధికారులు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా వీరి సేవలపై కస్టమర్ల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘భోజనం మామూలుగానే ఉంది.. అయితే అక్కడ వెయిటర్ ప్రవర్తన, వారు కస్టమర్లకు ఇస్తున్న మర్యాద, పరిశుభ్రత నిర్వహణ చాలా బాగున్నాయి..’ అంటూ గుప్తా తన కామెంట్ రాశారు. ‘భోజనం చాలా బాగుంది.. హోటల్‌ను వంద శాతం శుభ్రంగా ఉంచారు.. వెయిటర్ మర్యాదకరంగా మెసలుకుంటున్నారు. మెనూలో మరిన్ని వెరైటీలు పెడితే ఇంకా బాగుంటుంది..’ అని భూమికా దాబాస్ తన వ్యాఖ్యలో పేర్కొన్నారు. లాభాపేక్షలేని ఈ హోటల్లో తాజ్ బ్రాండ్ భోజనాన్ని ఖైదీలు అందజేస్తున్నారని తీహార్ జైలు ప్రతినిధి సునీల్ గుప్తా తెలిపారు. ఈ జైలులో 13,552 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కరడుగట్టిన వారే. అధికశాతం జీవిత ఖైదును అనుభవిస్తున్నవారే. వీరిలో మానసిక పరివర్తన కలిగించేందుకు జైలు ప్రాంగణంలో పలు వృత్తినైపుణ్య కోర్సులు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుప్తా వివరించారు. జైలులో చేపడుతున్న సంస్కరణలు, వాటి ఫలాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేసి అందులో ఖైదీలనే సిబ్బందిగా నియమించామని గుప్తా తెలిపారు. ఇటువంటి ప్రయోగం రెండేళ్లుగా కేరళలో చేపడుతున్నారని, అక్కడ మంచి ఫలితాలు సాధించడంతో తీహార్ జైలులో దాన్ని ఆచరిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు స్వయంగా ఉపాధిని పొందేందుకు వీలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని ఆయన వివరించారు. ‘పలువురు ఖైదీలను దగ్గరగా గమనించిన అధికారులు, వారిలో మానసిక పరివర్తన సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే బయట ప్రపంచానికి దగ్గరగా తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారని నాకనిపించింది.. ఏదేమైనా ఈ హోటల్లో పనిచేస్తోంది కరడుగట్టిన నేరస్తులేనా అని వారి ప్రవర్తన చూశాక మనకు అనిపించకమానదు.. అధికారులు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుందనే ఆశిద్దాం..’ అంటూ ఈ హోటల్‌కు మొదటిసారి తినడానికి వచ్చిన అతుల్‌సింగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఇందులో వెయిటర్‌గా పనిచేస్తున్న బాల్ కిషన్ గ్రోవర్ (49) మాట్లాడుతూ తాను క్షణికావేశంలో చేసిన హత్య కేసులో 13 యేళ్లుగాతీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నానని తెలిపాడు. ఇక్కడికి రాకముందు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడినని, విడుదలై వెళ్లిన తర్వాత తీహార్ రెస్టారెంట్‌కు అనుబంధంగా ఒక శాఖను ఏర్పాటుచేస్తానని ధీమాగా చెప్పాడు.


