
బ్రైడల్ షోలో పలువురు మెరిసిన తారలు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌ను ముంబైలో ఆవిష్కరించారు ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్‌గా అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్ గుప్తా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో అద్భుతమైన లుక్‌లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. గౌరవ్‌తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు డైమండ్ ఆభరణాలతో దేవకన్యలా మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్ చేశారట. అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్‌లో కూడా ఈ బ్రైడ్‌ల్ షోలో సందడి చేసింది. (పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?)
ఈ ఇంకా షోలో డైరెక్టర్ కిరణ్‌రావు, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్ దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని