
టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్(Sameera Shareef) ఒకతల్లిగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమీరా NICU శిశువుల కోసం 6 లీగటర్లకు పైగా తల్లిపాల (Breast Milk)ను భద్రపర్చారు. కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, తాను తనబిడ్డ సయ్యద్ అమీర్(రెండోబిడ్డ)ఇది సాధించామని ఇకముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో సమీరాపై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులు
ఆరు నెలల వరకు శిశువులకు తల్లి పాలు చాలా అవసరం. అలా తల్లి పాల విశిష్టతను తెసుకున్న చాలామంది మాతృమూర్తులు, తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను (బ్రెస్ట్‌మిల్క్)ను దానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమీరా కూడా తన పాలను డొనేట్ చేశారు. అంతేకాదు దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదనీ, తల్లిపాలు ఇవ్వడం అంత కష్టమేమీ కాదని పాలిచ్చే తల్లులకు ప్రోత్సాహానిచ్చారు. . మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ఉండండి, విశ్రాంతి తీసుకోండి. బాగా తినండి, హైడ్రేటెడ్ గా ఉండండి, బాగా తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పారు. అలాగే ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి భయపడాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు.
fy"> టీవీ నటిగా, యాంకర్‌గా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సమీరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆడపిల్ల, అభిషేకం ముద్దుబిడ్డ, మూడు ముళ్ల బంధంలాంటి సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది సమీరా. 2019లో అన్వర్ జాన్(Anwar Jahn)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంటకు అర్హాన్, ఆమీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.