గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్‌లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..
ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు.
తప్పనిసరిగా తినాల్సినవి..
ఈ కాలంలో సూప్‌లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు.
అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా.
చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందట
తేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్‌లు, యాంటిఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి.
అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయట
ఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు.
పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట.
ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు.
ఈ సీజన్‌లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట.
స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలు
చాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట.
ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!)


