లండన్: ఆర్థిక నేరాల కేసులో భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు మరోసారి వార్తల్లో నిలిచారు. దేశం విడిచి పారిపోయినా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వీరిద్దరూ తాజాగా లండన్‌లో ఎంజాయ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా భారత్‌పై వ్యంగ్యగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
లండన్‌లో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బయటపడింది. ఈ వీడియోలో లలిత్ మోదీ.. ‘భారత్ నుంచి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లు మేమిద్దరమే’ అని వ్యంగ్యంగా పరిచయం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.
అంతేకాదు సంబంధిత వీడియోను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంటర్నెట్‌ను మరోసారి భారత్‌లో బ్రేక్ చేద్దాం. హ్యాపీ బర్త్‌డే మై ఫ్రెండ్ విజయ్ మాల్యా లవ్వ్యూ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు, వీడియోలో కనిపించిన ధోరణిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వీరిద్ధరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
🚨 🇮🇳 UNBELIEVABLE! Embezzler of billions Lalit Modi brags on camera about being India’s top fugitive on the run!
Vijay Mallya there but stays silent, skipping the shameless tirade.
These audacious criminals must be extradited back to India at any cost! pic.twitter.com/ijeNYZM4wB— Uday Singh (@udaysinghkali) December 23, 2025


