USAలో 25 వేల మంది వలస నేరస్థులు? | Thousands of illegal immigrants in the USA are criminals | Sakshi
Sakshi News home page

USAలో 25 వేల మంది వలస నేరస్థులు?

Feb 7 2026 1:39 PM | Updated on Feb 7 2026 5:15 PM

Thousands of illegal immigrants in the USA are criminals

ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదంటూ వారిపై కఠిన ఆంక్షలు జారీ చేశారు. అయితే USAలోకి అక్రమంగా ప్రవేశించి తీవ్రనేరాలు చేసిన వారి జాబితాను వరస్ట్ క్రిమినల్స్ పేరుతో డిపార్ట్‌ మెంట్ ఆప్ హోమ్‌ లాండ్ విడుదల చేసింది.

దాదాపుగా  25,000కు పైగా క్రిమినల్స్  ఈ జాబితాలో ఉన్నారు. వారు హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల రవాణా లాంటి తీవ్రమైన నేరాలలో అరెస్టైనట్లు DHS పేర్కొంది. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలకు అనుగుణంగా వీరిని శిక్షించనున్నట్లు  తెలిపింది. ఈ క్రిమినల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరస్ట్ ఆఫ్‌ది వరస్ట్ క్రిమినల్స్ పేరుతో  విడుదల చేసింది.

"ఈ రాక్షసులు మన సమూహాన్ని హింసకు గురిచేస్తున్నారు. వీరందరిని దేశం నుంచి తరిమే వరకూ వదలం. అమెరికన్లు వీరివల్ల ఇబ్బందులకు గురికావద్దు. వీరు మన దేశంలో అనుమతి లేకుండా నివసిస్తున్నారు." అని డీహెచ్‌ఎస్ పోస్ట్ చేసింది. వీరు చేసిన నేరాలు, అరెస్టైన వారి వివరాలు వారి అదే విధంగా దేశబహిష్కరణ చేసిన సమాచారం అమెరికన్లకు తెలియాలని ఈ వివరాలు పోస్ట్ చేసినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. 

అక్రమంగా అమెరికాలో నివసిస్తూ నేరాలు చేస్తున్న వారి స్నాప్‌షాట్ ఇదని పేర్కొంది. కాగా ఈ నేరస్థుల జాబితాలో 89 మంది భారతీయులు ఉన్నారు. కాగా ట్రంప్ అక్రమ వలసదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. వారంతట వారు స్పచ్ఛందంగా అమెరికాను వదిలితే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement