వన్స్ అపాన్ ఏ టైమ్... లవ్ స్టోరీలు కావచ్చు... జస్ట్ నిన్న మొన్నటి లవ్‌స్టోరీ కావచ్చు... లవ్‌స్టోరీలు ఎప్పుడూ హాట్ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్‌కు చెందిన ఇంజినీర్ రాహుల్ కుమార్ లవ్‌స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన రాహుల్ జపాన్‌లోని ఆటోమొబైల్ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. టోక్యోలో జరిగిన అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో జపనీయురాలైన మెరీనాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారింది.
‘నా జీవితంలోని కీలకమైన మలుపు టోక్యోలో జరిగిన వ్యాపార సమావేశంలో మొదలవుతుందని ఊహించలేదు. మేము మొదట స్నేహితులం. స్నేహం నమ్మకంగా పరిణామం చెందింది, ఆ నమ్మకం ప్రేమగా వికసించింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చినప్పటికీ ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవడంప్రారంభించాం’ అని రాశాడు రాహుల్.
మొదట్లో వీరి పెళ్లికి ఇరుపక్షాల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ ఆ తరువాత పచ్చజెండా ఊపారు. పెళ్లి వేడుకలు దిల్లీలో, రిసెప్షెన్ దిల్లీలో జరిగింది. ఆ తరువాత వీరు బిహార్‌లోని మాదేపుర గ్రామానికి వెళ్లారు. అది రాహుల్ కుమార్ స్వగ్రామం. ‘నమస్తే ఇండియా. ఐయామ్ మెరీనా యాదవ్’ అని తనను తాను పరిచయం చేసుకున్న మెరీనా తమ లవ్ స్టోరీ (Love Story) ఎలా ప్రారంభమైందో వివరించింది. మొత్తానికైతే వీరి వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాం


