అమ్మాయిలు.. మీకు చాలా లైఫ్ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. తనకు 25వ ఏటనే పెళ్లయిందని, ఆ తప్పు మరెవరూ చేయకూడదంటోంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. కాకపోతే నా వైవాహిక జీవితంలో జరిగిన ఓ అందమైన విషయం ఏంటంటే బిడ్డను కనడం.
వర్కవుట్ కాలేదు
అయినప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ముందు లైఫ్‌ను ఆస్వాదించండి.. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవండి అని సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని నేను బలంగా నమ్ముతాను. కానీ ఎందుకో మరి నా విషయంలో వర్కవుట్ కాలేదు. విడిపోయాం.. నేను అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగాను.

ప్రేమను పొందడం ఇష్టం
కొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎన్నడూ విసుగుచెందలేను. ఇప్పటికీ నా లైఫ్‌ను నేను ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన నాకెంతో ఇష్టం. ప్రేమను పంచడం, పొందడం భలే ఇష్టం. అలా అని ఇప్పుడు నేను ప్రేమ కోసం ఎదురుచూడటం లేదు. ఒకవేళ అది నా ఇంటి తలుపు తడితే దాన్ని కాదనలేను, తప్పకుండా ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చింది.
పెళ్లి- విడాకులు
చయ్య చయ్య, కెవ్వు కేక వంటి ఐటం సాంగ్స్‌తో పాపులర్ అయిన మలైకా అరోరా.. 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. కొంతకాలానికి మలైకా - అర్బాజ్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడిపోయారు. తర్వాత అర్బాజ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. మలైకా.. హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం నడిపింది, కానీ వీరి బంధం పెళ్లి పట్టాలెక్కేలోపు బ్రేకప్ చెప్పుకున్నారు.
చదవండి: చెప్పలేనంత బాధ.. భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్


