నిన్నటి రోజు ‘హ్యాపీ న్యూ ఇయర్’ మెసేజ్‌లు, పలకరింపులతోనే గడిచిపోయి ఉంటుంది. కాస్త నిదానంగా ఆలోచించడానికి ఇదే సరిౖయెన రోజు. ఈరోజు మనపై మనం స్టడీ నిర్వహించుకుందాం. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి.
⇒ గత సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమిటి?
⇒ ఎందుకు ఇబ్బందిగా అనిపించింది?
⇒ గత సంవత్సరం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటి?
⇒ ‘కొత్త సంవత్సరం.. కొత్త విద్య’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా ఈ సంవత్సరం నేర్చుకోవాలనుకుంటున్నది ఏమిటి?
⇒ ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
.... 360 డిగ్రీల కోణంలో ప్రశ్నలు, వాటికి జవాబులు రాసుకోండి. ప్రతి నెల వాటిని సమీక్షించుకుంటూ ఉండండి. ఫలితం చూడండి!
చదవండి: కొత్త సంవత్సరం, కొత్త ఆశలు.. ఆశయాలు
ఇంగ్లీష్ ఇడియమ్స్
ఫ్లాష్ ఇన్ ది పాన్: కొన్ని విజయాలు ఒకేసారి వీలవుతాయి, రిపీట్ చేయడానికి కుదరదు...ఇలాంటి నేపథ్యంలో ఉపయోగించే మాట... ఫ్లాష్ ఇన్ ది పాన్ ఉదా: శాడ్లీ, దెయిర్ సక్సెస్ వజ్ జస్ట్ ఏ ఫ్లాష్ ఇన్ ది పాన్
టాక్ త్రూ యువర్ హ్యాట్: ఏమీ తెలియకుండా, అర్థం చేసుకోకుండా ఎవరైనా అజ్ఞానంతో మాట్లాడే సందర్భంలో వాడే మాట... టాక్ త్రూ యువర్ హ్యాట్
స్విమ్ విత్ ది ఫిషెస్: ‘హత్యకు గురయ్యాడు’ అని చెప్పడానికి సంబంధించి వాడే మాట.. స్విమ్ విత్ ది ఫిషెస్ లేదా స్లీప్ విత్ ది ఫిషెస్, హాలివుడ్ సినిమా ‘గాడ్‌ఫాదర్’తో స్విమ్ విత్ ది ఫిషెస్ పాపులర్ అయింది.
టిప్పింగ్ పాయింట్: చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పు, కీలక మార్పుకు కారణం అవుతాయని చెప్పే సందర్భంలో వాడే మాట... టిప్పింగ్ పాయింట్. భారీ మార్పుకు కారణమయ్యే కీలక పరిణామాన్ని గురించి చెప్పే సమయంలో కూడా ఈ మాటను వాడుతారు.


