రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.
బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.
Start the New Year the smart way with #BSNL.
Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.
Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.
Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026


