25,480 మార్కు వద్ద నిఫ్టీ | stock market updates on 20 February 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 25,480 మార్కు వద్ద నిఫ్టీ

Feb 20 2026 9:51 AM | Updated on Feb 20 2026 11:29 AM

stock market updates on 20 February 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 25,486 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 40 పుంజుకొని 82,552 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.96

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.9 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.28 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.31 శాతం దిగజారింది.

ఇరాన్‌తో అణు చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధానికి సిద్ధమైంది. అమెరికా కీలక వడ్డీ రేట్ల విషయంపై ఫెడరల్‌ రిజర్వ్‌ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు జనవరి 27–28 జరిగిన ఫెడ్‌ సమావేశ మినిట్స్‌లో వెల్లడైంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతలను ఆలస్యం చేసినా లేదా రేట్లు పెంచినా, భారత ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలం. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో  క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. భారత్‌కు దిగుమతి అయ్యే బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 71 డాలర్లపైకి చేరింది.

Today Nifty position 20-02-2026(time: 9:48 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement