డబ్ల్యూపీపీ మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ వెల్లడి
ముంబై: దేశీయంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026లో రూ. 2,01,891 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూపీపీ మీడియా వెల్లడించింది. 2025తో పోలిస్తే రూ. 17,844 కోట్లు అధికంగా, 9.7 శాతం మేర వృద్ధి చెందవచ్చని దిస్ ఇయర్ నెక్ట్స్ ఇయర్ నివేదికలో పేర్కొంది. ఇందులో డిజిటల్ వాటా 68.1 శాతంగా ఉండనుందని డబ్ల్యూపీపీ మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు.
కృత్రిమ మేధ, వాణిజ్యం, గోప్యత కలిసి, వినియోగదారులతో ప్రకటనకర్తల బంధాన్ని సరికొత్తగా నిర్వచిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం డీఏవీపీ ధరల పెంపుతో ప్రింట్ మాధ్యమంలో ప్రకటనల ఆదాయాలు 4.4%, టీవీ 3.1%, ఆడియో 1.5% వృద్ధి చెందనున్నాయి. టాప్ 10 గ్లోబల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లలో భారత్ ఒకటన్నారు.


