పాకెట్‌ ఎఫ్‌ఎం లక్ష్యం ఇదే! | Pocket FM Target of 1 Million Creators | Sakshi
Sakshi News home page

పాకెట్‌ ఎఫ్‌ఎం లక్ష్యం ఇదే!

Feb 19 2026 9:14 PM | Updated on Feb 20 2026 9:58 AM

Pocket FM Target of 1 Million Creators

ఈ ఏడాది (2026) ఆఖరు నాటికి 10 లక్షల క్రియేటర్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆడియో సిరీస్‌ ప్లాట్‌ఫాం పాకెట్‌ ఎఫ్‌ఎం వెల్లడించింది. గత ఏడాది వ్యవధిలో 3 లక్షల మంది పైగా క్రియేటర్లు తమ తొలి స్టోరీలను ఈ ప్లాట్‌ఫాం మీద పబ్లిష్‌ చేసినట్లు వివరించింది. దీనితో తమ క్రియేటర్‌ ఎకానమీ విలువ రూ. 300 కోట్లు దాటిందని, 2026 ఆఖరు నాటికి ఇది మూడు రెట్లు పెరిగి రూ. 1,000 కోట్లకు చేరుతుందమే అంచనాలు ఉన్నట్లు పాకెట్‌ ఎఫ్‌ఎం పేర్కొంది.

2025 నాటి కంపెనీ డేటా ప్రకారం టాప్‌ 10 శాతం మానిటైజ్డ్‌ క్రియేటర్లు 2025లో సంయుక్తంగా రూ. 50 కోట్లు ఆర్జించారు. టాప్‌ 1 శాతంలోని వారు ఏటా రూ. 50 లక్షలు పొందగా, 20 శాతం మంది పైగా క్రియేటర్లు నెలకు రూ. 1 లక్ష పైగా అందుకుంటున్నారు. తమ ఏఐ ఉత్పత్తుల శ్రేణితో కంటెంట్‌ క్రియేషన్‌కి పట్టే సమయం 90 శాతం పైగా తగ్గిందని పాకెట్‌ ఎఫ్‌ఎం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement