ఓపెన్‌ ఏఐ ఇన్‌ఫ్రాకు టీసీ‘ఎస్‌’  | TCS shares rise 2percent after Tata Group and OpenAI announce strategic partnership | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ఏఐ ఇన్‌ఫ్రాకు టీసీ‘ఎస్‌’ 

Feb 20 2026 5:55 AM | Updated on Feb 20 2026 5:55 AM

TCS shares rise 2percent after Tata Group and OpenAI announce strategic partnership

న్యూఢిల్లీ: ఐటీ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ తాజాగా ఓపెన్‌ ఏఐతో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా 100 మెగావాట్ల ఏఐ మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రా) కల్పనకు తెరతీయనుంది. ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని ఒక గిగావాట్‌వరకూ పెంచుకునేందుకు వీలుంది. కొన్నేళ్లపాటు అమల్లోఉండే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. తద్వారా ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశాయి. 

ఒప్పందంలో భాగంగా టీసీఎస్‌కు చెందిన హైపర్‌వాల్ట్‌ యూనిట్‌.. ఏఐ రెడీ, గ్రీన్‌ ఎనర్జీ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇది తదుపరి తరం ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతుగా నిలవనున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. రెండు సంస్థల మధ్య సహకారం నేపథ్యంలో ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్‌కు దన్నుగా టాటా గ్రూప్‌ ఉద్యోగులకు ఎంటర్‌ప్రైజ్‌ చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుంది. దేశీయంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో భాగంగా టీసీఎస్‌ తాజా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement