న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భాగమైన అమెజాన్ పే ఫిక్స్‌డ్ డిపాజిట్ల సేవలను ప్రవేశపెట్టింది. ఇందుకు శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్‌లతో పాటు 5 బ్యాంకులతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు వీటిలో ఉన్నాయి. ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా అవసరం లేకుండా రూ. 1,000 నుంచి ఎఫ్‌డీ ఖాతాను తెరవొచ్చని సంస్థ తెలిపింది. వార్షికంగా 8% వరకు వడ్డీ రేటు పొందవచ్చని పేర్కొంది. ప్రతి బ్యాంకులో రూ. 5 లక్షల వరకు ఎఫ్‌డీలకు బీమా రక్షణ ఉంటుంది.


