భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ ఆదుకోవడంతో సూచీలు వరుసగా మూడవ సెషన్ లాభాలను విస్తరించాయి.
మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 283.29 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 83,734.25 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.95 పాయింట్లు లేదా 0.37 శాతం ఎగిసి 25,819.35 వద్ద ముగిసింది
సెన్సెక్స్ లో టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎం అండ్ ఎం 2.8 శాతం వరకు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్టెక్, టీసీఎస్ 1.6 శాతం వరకు నష్టపోయాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.5 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.54 శాతం పెరిగింది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ బుధవారం 3.5 శాతం క్షీణించింది.
రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.2 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.23 శాతం పడిపోయింది.


