బిగ్‌బాస్ నుంచి 'గౌరవ్‌' ఎలిమినేట్‌.. రెమ్యునరేషన్‌ కూడా తక్కువే | Gaurav gupta Eliminated in Bigg Boss 9 telugu and remuneration | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ నుంచి 'గౌరవ్‌' ఎలిమినేట్‌.. రెమ్యునరేషన్‌ కూడా తక్కువే

Nov 17 2025 8:05 AM | Updated on Nov 17 2025 8:40 AM

Gaurav gupta Eliminated in Bigg Boss 9 telugu and remuneration

బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా గౌరవ్‌ హౌస్‌ నుంచి వచ్చేశాడు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో నిఖిల్‌ నాయర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్‌ కావడం విశేషం. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్‌ దెబ్బ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఎలిమినేషన్‌ రౌండ్‌లో చివరి వరకు దివ్య, గౌరవ్‌ ఉంటే ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌరవ్‌ హౌస్‌ నుంచి బయటకు రావాల్సి ఉంటుందని హౌస్ట్‌ నాగార్జున ప్రకటించారు. అయితే, తన రెమ్యునరేషన్‌ కూడా  ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే కాస్త తక్కువేనని తెలుస్తోంది.

అక్టోబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా హౌస్‌లోకి గౌరవ్‌ ఎంట్రీ వచ్చాడు. అయితే, అతడికి వారానికి రూ. 1.5 లక్షల మేరకు రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.7.5 లక్షల మేరకు సంపాదించాడు. ప్రస్తుతం 'గీత ఎల్ఎల్‌బీ' అనే సీరియల్ గౌరవ్‌ నటిస్తున్నాడు. అతనితో పాటు ఎలిమినేట్‌ అయిన నిఖిల్‌ ఐదువారాలకు రూ. 12 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్ల తెలుస్తోంది.

తనూజ సేవింగ్ పవర్‌
ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా  ఎలిమినేషన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరూ చివరి వరకు మిగిలారు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే,  తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్‌ను ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగుతూ అది ఈ వారంతో ఎక్స్‌పెయిర్ అవుతుందని గుర్తుచేస్తారు.  ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అవుతుందని క్లారిటీ ఇస్తారు. అప్పుడు మాత్రమే  గౌరవ్ సేఫ్ అవుతాడని కండీషన్‌ పెడుతారు. దీంతో తనూజ కొంత సమయం ఆలోచించి ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్‌ను గౌరవిస్తున్నానంటూ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్‌ను వాడటం లేదని చెప్పడంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అలా దివ్య కూడా సేఫ్‌ అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement