సాయిపల్లవి.. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్. గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్'తో ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఈమె హిందీలో 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇది రాబోయే దీపావళికి థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. దీనికంటే ముందో ఓ హిందీ రొమాంటిక్ మూవీతో రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కావాల్సినప్పటికీ.. స్టార్ హీరో వల్లే ఆలస్యమవుతోందని మాట్లాడుకుంటున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. హిందీలో చేసిన తొలి సినిమా 'మేరే రహో'. సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్‌లోనే పూర్తయిపోయింది. లెక్క ప్రకారం అయితే డిసెంబరు రెండో వారంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ 'ధురంధర్' దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. కొడుకు చిత్రం మార్కెటింగ్ అంతా చూసుకుంటున్న ఆమిర్ ఖాన్.. కావాలనే ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశాడు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ బాలీవుడ్‌లో బోర్డర్ 2, ధురంధర్ 2, బ్యాటల్ ఆఫ్ గాల్వాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇంత పోటీలో వస్తే తమ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావని భయపడ్డాడో ఏమో గానీ ఆమిర్ ఖాన్.. 'మేరే రహో' చిత్రాన్ని జూలైలో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. 'రామాయణ' రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే సాయిపల్లవి హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి బజ్ లేదు.
ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఓ మూవీ, థియేటర్లలో ఓ సినిమా(లవ్ టుడే రీమేక్) చేశాడు. రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సాయిపల్లవితో చేసిన చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి?


