ఓటీటీలోకి వచ్చిన వార్ బ్యాక్‌డ్రాప్ మూవీ | 120 Bahadur Movie Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

120 Bahadur OTT: యదార్థ సంఘటనల ఆధారంగా సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్

Jan 2 2026 1:43 PM | Updated on Jan 2 2026 1:49 PM

120 Bahadur Movie Streaming Now On This OTT

ఈ వీకెండ్ థియేటర్లలో సైక్ సిద్ధార్థ్, వనవీర, 45 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. కానీ వీటిలో ఏది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. క్రిస్మస్‌కి వచ్చిన చిత్రాల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా చాలా కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు దానిలోకి మరో వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేరింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్‌?)

బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్.. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన సినిమా '120 బహదూర్'. 1962లో భారత్-చైనా మధ్య జరిగిన రెజాంగ్ లా యుద్ధ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలో రిలీజైంది. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడీ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరో రెండు వారాల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు.  మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.

(ఇదీ చదవండి: సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement