డిమాన్ పవన్ టాస్క్‌ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్‌మేట్స్‌కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
నిఖిల్ ఔట్
రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్‌లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. నిఖిల్‌ను తప్పిస్తున్నట్లు చెప్పింది.
కెప్టెన్‌కు ఎదురుతిరిగిన గౌరవ్
పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్‌గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్‌లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్‌కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్‌ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్‌కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు.

భోజనమే ఉండదు
ఈ గొడవ ముదరడంతో.. గౌరవ్‌ను కిచెన్ డిపార్ట్‌మెంట్ నుంచి పీకేసి వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్‌బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు.
దెబ్బకు జడుసుకున్న రీతూ
అనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్‌లో తనూజ గెలిచింది.
చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్‌లో.. నటి


