'పర్ఫామెన్స్‌ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే? | Bigg Boss Telugu 9 nominations: Emmanuel safe again; six contestants on the list | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: దివ్యను నామినేట్‌ చేసిన రీతూ.. 10వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు!

Nov 10 2025 12:26 PM | Updated on Nov 10 2025 1:08 PM

Bigg Boss 9 Telugu: 10th Week Nominations List

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్‌కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్‌ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండి, బాగా గేమ్స్‌ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్‌లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్‌ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. 

భరణిని నామినేట్‌ చేసిన ఇమ్మూ
అయితే తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్‌ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్‌ ఇమ్మాన్యుయేల్‌. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్‌ భరణిని నామినేట్‌ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్‌ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. 

ఎమోషనల్‌ డ్రామా ఎక్కువైంది
రీతూ.. దివ్యను నామినేట్‌ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్‌.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్‌ లేదు కానీ ఎమోషనల్‌ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్‌ చేశాడు గౌరవ్‌. కల్యాణ్‌.. నిఖిల్‌ను నామినేట్‌ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్‌, గౌరవ్‌, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

 

చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్‌ ఇచ్చిన నాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement