బిగ్‌బాస్‌ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్‌ ఇచ్చిన నాగ్‌ | Bigg Boss 9 Telugu: Nagarjuna Suggestion To Emmanuel Over Nominations | Sakshi
Sakshi News home page

ట్రోఫీ కోసం ఇద్దరి మధ్యే పోటీ.. రేసులో లేని కల్యాణ్‌.. ఆ ముగ్గురూ తప్పేనన్న సాయి

Nov 10 2025 11:00 AM | Updated on Nov 10 2025 11:09 AM

Bigg Boss 9 Telugu: Nagarjuna Suggestion To Emmanuel Over Nominations

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్‌కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్‌తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్‌లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్‌లో ఏం జరిగిందో నవంబర్‌ 9వ ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

ఇద్దరికీ సమాన ఓట్లు
ట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్‌కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్‌ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్‌మేట్స్‌ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్‌ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్‌ పవన్‌కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్‌కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్‌ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్‌ చేశారు.

దివ్యకు వాయింపులు
ఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌ గురించి మాట్లాడాడు నాగ్‌. దివ్య స్ట్రాటజీ కరెక్ట్‌.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్‌కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్‌గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్‌ ఫైట్‌ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఇమ్మూని హెచ్చరించిన నాగ్‌
ఇక బిగ్‌బాస్‌ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్‌తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్‌, నా ఫ్యాన్స్‌ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్‌ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్‌ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే.. అప్పటికే ఓటింగ్‌ అంతా ఫామ్‌ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్‌లోకి రమ్మని వార్నింగ్‌ ఇస్తూనే డైరెక్ట్‌గా హింటిచ్చాడు.

పవర్‌ వాడేందుకు ఒప్పుకోని తనూజ
ఇక నాగ్‌ అందర్నీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్‌ ఉపయోగించి సాయిని సేవ్‌ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్‌ అవుతాడని నాగ్‌ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్‌ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్‌లో ఇమ్మాన్యుయేల్‌, డిమాన్‌ పవన్‌, సుమన్‌ కరెక్ట్‌ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్‌ అని పేర్కొన్నాడు.

చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్‌.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement