తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) లో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇంటి మీద బెంగతో రాము స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆయన ఎలిమినేషన్‌కు కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత చూసేద్దాం..
ఇమ్యూనిటీతో హౌస్‌లోకి..
అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్ (Sreenivasa Sayee). ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాగ్ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్ వీక్‌లో వైల్డ్‌కార్డ్స్ నామినేషన్‌లోకే రాలేదు. తర్వాతి వారం నామినేషన్‌లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిపోయాడు. కానీ, మరో వైల్డ్ కార్డ్ రమ్య ఎలిమినేట్ అయింది.
కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు
ఆ తర్వాతి వారం తన ఇమ్యూనిటీ వాడుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. గత వారం మాత్రం ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాడు. తనూజను స్ట్రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసిన సాయి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కానీ, తనూజ ఫ్యాన్స్‌కు మాత్రం గిట్టలేదు. తనూజతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలనుకున్నారు. పోనీ, టాస్కుల్లో అరాచకంగా ఏమైనా ఆడాడా? అంటే అదీ లేదు.
అవకాశాలు దక్కించుకోలేక..
ఆడేంత సత్తా ఉన్నప్పటికీ అవకాశాన్ని చేజిక్కించుకునే తెలివి లేకుండా పోయింది. టీమ్‌లో ఉన్నాడే కానీ, ముందు వరుసలో ఆడలేకపోయాడు. దివ్య తెలివిగా అతడిని వెనకపడేయడం.. రీతూ మరింత తెలివిగా అతడ్ని ఆటలో తప్పించడంతో గేమ్స్ ఆడే ఛాన్సులు రాలేవు. హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంతో మానిప్యులేటర్ అన్న ముద్ర కూడా పడింది.
రెమ్యునరేషన్ ఎంత?
కెప్టెన్సీ గేమ్‌లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో తడబడ్డాడు. ఎక్కువ అయోమయానికి లోనయ్యాడు. అప్పటికీ నెమ్మదిగా తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అంత నెమ్మదితనం బిగ్‌బాస్ షోలో పనికిరాదు. ఫలితంగా సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడికి వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగువారాలకుగానూ రూ.8 లక్షల మేర సంపాదించాడన్నమాట!
చదవండి: Bigg Boss 9.. నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి


