టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్‌మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)
తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.
A HOUSEFULL festive day at the cinemas ❤️🔥
People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥
Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025


