టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో సత్తా చాటుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలో పలు సినిమాలతో మెప్పించిన నవీన్ చంద్ర.. శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.
ఈ సందర్భంగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు. ఆయనకు మొకాళ్లపై కూర్చుని నివాళులర్పించారు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో నవీనచంద్ర నటించిన తొలి సినిమా మార్క్. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ మూవీ క్రిస్‌మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వచ్చిన పోస్టర్స్ చూస్తే పవర్‌ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది.


