బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు.
అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.
అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూ
బిగ్‌బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది.
ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డి
బిగ్‌బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్‌లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్‌లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది.
తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.
కల్యాణ్ గెలుపులో ఐదుగురు
బిగ్‌బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.
#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.
accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025


