దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా సాయం చేయమని తనని కోరితే వెంటనే స్పందిస్తారు కూడా.. గతంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆర్థిక సాయం చేయమని కోరితే ఆయన దాతృత్వ వైఖరి చాలాసార్లు చూపించారు. దురదృష్టవశాత్తు, ఆయన చేస్తున్న సాయం ఆన్‌లైన్ మోసానికి గురి చేసింది. దీంతో ప్రకాష్ రూ. 20 వేలు పోగొట్టుకున్నారు.
ఎం జరిగిందంటే..?
ఎక్స్ పేజీలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి జీవీ ప్రకాష్‌ను మోసం చేశాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫోటోను షోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని పేర్కొన్నాడు. ఆపై తన తండ్రి కూడా చాలా ఏళ్ల క్రితమే బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని కట్టుకథ అల్లాడు. అయితే, ఆమె కూడా మరణించారని తన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ ఆర్థిక సహాయం చేయాలని జీవీ ప్రకాష్‌ను కోరాడు.
ఆ వ్యక్తి చెప్పిన స్టోరీకి చలించిపోయిన జీవీ ప్రకాష్ వెంటనే రూ. 20 వేలు గూగుల్ పే చేశారు. అయితే, కొందరు నెటిజన్లు ఆ ఫోటోను డీకోడ్ చేశారు. గూగుల్ ద్వారా ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో వెంటనే అతని నెంబర్‌కు కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ కాలేదని ప్రకాష్ చెప్పుకొచ్చారు. అమ్మ పేరు చెప్పుకొని సాయం కోరి ఇలా మోసం చేయడం ఏంటి అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. అడిగిన వెంటనే సాయం చేసిన ప్రకాష్‌ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మోసాలు చూసిన తర్వాత సాయం చేసే వ్యక్తులు కూడా మరోసారి ముందుకు రారని గుర్తుచేస్తున్నారు.
நானும் தங்கச்சியும் என்ன பண்ணுவது தெரியமால் உல்லோம் எங்களுக்கு இறுதி சடங்கு பண்ணுவதாருக்கு உதவி பண்ணுங்க அண்ணா @gvprakash 🙏🏻🥲 https://t.co/iXJWnwQpR6
— Mom Little King.♥️ (@prasannasathis) December 25, 2025
— G.V.Prakash Kumar (@gvprakash) December 25, 2025


