ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా.. అని ఓ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు దివ్వెల మాధురికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. బిగ్‌బాస్(Bigg Boss 9 Telugu) హౌస్‌లోకి ఎప్పుడొచ్చాం..ఎప్పుడు పోయామని కాదు.. మనదైన ముద్ర వేశామా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో మాధురి సక్సెస్ అయినట్లే. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌస్‌లోకి వెళ్లి.. మూడు వారాలకే బయటకు వచ్చినా.. తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఫైర్‌బ్రాండ్‌గానే హౌస్‌లోకి వెళ్లి..ఆట కూడా అలాగే ఆడింది. గొడవలు, అరుపులతో కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు..టాస్కులు కూడా బాగానే ఆడింది. కానీ మూడోవారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.
తాను కావాలనుకొనే బయటకు వచ్చానని మాధురి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షో ద్వారా మాధురి భారీగానే సంపాదించిదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మూడు వారాలకు గాను ఏకంగా రూ. 9లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు.
డబ్బుల కోసం వెళ్లలేదు..
బిగ్‌బాస్ షోకి చాలామంది ఫేమ్ కోసమో లేదా మనీ కోసం వెళ్తుంటారు. కానీ మాధురి మాత్రం ఎక్స్‌పీరియన్స్ కోసమే వెళ్లారట. డబ్బుల కోసం అయితే తాను బిగ్‌బాస్ షోకి వెళ్లలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పైవిధంగా చెప్పింది. ‘నేను డబ్బులకు టెంప్ట్ అయి బిగ్‌బాస్ షోకి వెళ్లలేదు.
నాకు బయటే రోజు 2-3 లక్షలు వస్తాయి. బిగ్‌బాస్ షో మొత్తం ఆడితే కోటి వరకు వస్తాయేమో కానీ..నేను నెలకే రూ. కోటి సంపాదిస్తాను. అసలు నేను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండే చేయలేదు. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి.. లైఫ్‌లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా’ అని మాధురి చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.


