రవికృష్ణ, నవదీప్, నందు, మనికా చిక్కాల, బింధు మాధవి, రాధ్య, అదితీ భావరాజు, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఓ బూతు పదంతో సహా మొత్తంగా 15 మార్పులు సూచిస్తూ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 2.16 గంటల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇందులో వాడిన కొన్ని బూతు పదాలను కచ్చితంగా తొలగించాలని ఆదేశించారు. అలాగే సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్‌తో ఇందులోని పాత్రలు కల్పితనమి పేర్కొనాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవటం విశేషం. చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో అయితే నిన్ననే(డిసెంబర్ 23) ప్రీమియర్స్ పడ్డాయి.


