– శ్రీవిష్ణు
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’.
శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు నేడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన శ్రీవిష్ణు బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా ‘ఈషా’ టిక్కెట్ ధరలు అందరికీ అందు బాటులో (రూ. 99) ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు అంగీకార పత్రంపై సైన్ చేశాకే ‘ఈషా’ చూడాల్సి ఉంటుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘హారర్ సినిమా లవర్స్ మా ‘ఈషా’ని ఎంజాయ్ చేస్తారు’’ అని బన్నీ వాసు చెప్పారు. ‘‘ఈషా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శ్రీనివాస్ మన్నె, అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, నిర్మాత వెంకట్ పేర్కొన్నారు.


