'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆంథమ్‌ రిలీజ్‌ | The Anthem of Mr Work From Home Released | Sakshi
Sakshi News home page

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆంథమ్‌ రిలీజ్‌

Jan 24 2026 5:51 PM | Updated on Jan 24 2026 6:11 PM

The Anthem of Mr Work From Home Released

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా  ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు,  ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఆంథమ్‌ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది .ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది.

బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement