'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో | Sree Vishnu Cameo In Sharwanand Starrer Nari Nari Naduma Murari Movie, Interesting Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Nari Nari Naduma Murari Movie: శర్వానంద్‌ సినిమాలో మరో తెలుగు హీరో

Jan 4 2026 1:37 PM | Updated on Jan 4 2026 2:02 PM

Sree Vishnu Cameo in Sharwanand Starrer Nari Nari Naduma Murari Movie

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్‌, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్‌ వదిలారు. టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. 

ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌
ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. 

సంక్రాంతి బరిలో సినిమాలు
సంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్‌ 'రాజాసాబ్‌', విజయ్‌ 'జననాయగణ్‌' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్‌ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్‌' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి.

 

 

చదవండి: జన నాయగణ్‌ ట్రైలర్‌లో ఏఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement