రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్‌తో ఇది నిజమేనని రుజువైంది.
తెలుగు మూవీ రీమేక్
భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్‌లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమా
విజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది.
They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026
చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు


