తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు | Bigg Boss Geetu Royal Tirumala Temple Issue | Sakshi
Sakshi News home page

Geetu Royal: కొండపై రీల్‌తో ఓవరాక్షన్.. సగం జీవితం కోల్పోయానని ఇప్పుడు వీడియో

Feb 28 2026 4:28 PM | Updated on Feb 28 2026 4:32 PM

Bigg Boss Geetu Royal Tirumala Temple Issue

తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా 'బిగ్‌బాస్' ఫేమ్ గీతూ రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

రీసెంట్‌గా తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన యూట్యూబర్ గీతూ.. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్‌లోడ్ చేసింది. దీంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు రీల్‌ని డిలీట్ చేసింది. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈమె.. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది.

తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదేపదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం.. కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫొటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. అయినా సరే గీతూ రాయల్ లాంటి యూట్యూబర్లు.. సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గానీ తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి ఈమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శివానీ నాగరం)

Advertisement
 
Advertisement
Advertisement