
ఆదివారం ఎపిసోడ్‌తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్‌లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?
(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్‌ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.

అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్‌లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ వారం నామినేట్ అయినోళ్లు
భరణి
పవన్
దివ్య
రాము
సుమన్
తనూజ
(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!)