
తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆమెనే 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నె. పదిరోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది. ఇద్దరు జంటగా, రొమాంటిక్‌గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తోటీ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)
తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు. అలాంటి వాళ్లలో దీప్తి మన్నె ఒకరు. బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లలో 'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి', 'పద్మావతి' తదితర సీరియల్స్ చేసింది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం తాను రోహన్‌తో ప్రేమలో ఉన్నానని దీప్తి.. ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. 'డియర్ రోహన్. నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ' అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పరిచయం చేసింది. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో!
(ఇదీ చదవండి: నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!)


