
డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). టిల్లు స్క్వేర్‌తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా?
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సిద్ధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రియల్ లైఫ్‌లో మీరు స్త్రీలోలుడా? టీనేజ్‌లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా? అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది. అది విని సిద్ధుకు మండిపోయింది. ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని కోప్పడ్డాడు. ఈ మధ్యే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌పైనా సదరు మహిళా జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమిళ హీరోను కించపరుస్తూ..
మీరు హీరోలానే ఉండరు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే.. అది మీ హార్డ్ వర్కా? లేక అదృష్టమా? అని ప్రశ్నించారు. వెంటనే శరత్ కుమార్ మైక్ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటరిచ్చాడు. కిరణ్ అబ్బవరం సైతం స్పందిస్తూ... పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు. బిగ్‌బాస్ షోలో నాగార్జున సైతం.. ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు.