
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.
షూటింగ్‌కు ముందు ప్రిపరేషన్
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు.
జీవితం విలువ తెలిసొచ్చింది
కొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి