breaking news
Deepthi Manne
-
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
సీరియల్ నటి దీప్తి మన్నె (Deepthi Manne) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు రోహన్‌తో పెళ్లిపీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో పెళ్లికూతురిగా ముస్తాబైన దీప్తి.. సిగ్గుపడుతూ మండపంలోకి నడిచింది. పంతులు మంత్రాలు చదువుతుండగా వధూవరులు ఇద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు దీప్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దీప్తి మన్నె బెంగళూరువాసి. మొదట్లో తన మాతృభాష కన్నడలో పలు సీరియల్స్ చేసింది. అలాగే సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు ధారావాహికల్లో నటించింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by 🌸Kedhar Dhathri🌸 (@kedhar_dhathri_xworld) చదవండి: తొడకొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్.. విజయ్ దేవరకొండకు ఆర్డర్.. -
పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్
బుల్లితెర నటి దీప్తి మన్నె (Deepthi Manne) పెళ్లి ఘడియలు వచ్చేశాయి. గత నెలలో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఆమె ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు రోహన్‌తో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి దీప్తి - రోహన్ జంట హల్దీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హల్దీ వేడుకలు సంతోషంగా, ఉత్సాహంగా సాగాయి. సీరియల్స్‌తో ఫేమస్ఈమేరకు ఓ వీడియోను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన దీప్తి మన్నె.. మొదట్లో కన్నడ భాషలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు సీరియల్స్ చేసింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Navya Rao (@navya_raooo) View this post on Instagram A post shared by Deepthi Manne (@deepthimanne_official) చదవండి: బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు -
ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆమెనే 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నె. పదిరోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది. ఇద్దరు జంటగా, రొమాంటిక్‌గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తోటీ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు. అలాంటి వాళ్లలో దీప్తి మన్నె ఒకరు. బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లలో 'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి', 'పద్మావతి' తదితర సీరియల్స్ చేసింది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, నమ్మూర హైక్‌లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం తాను రోహన్‌తో ప్రేమలో ఉన్నానని దీప్తి.. ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. 'డియర్ రోహన్. నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ' అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పరిచయం చేసింది. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో!(ఇదీ చదవండి: నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!)


