సీరియల్ నటి దీప్తి మన్నె (Deepthi Manne) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు రోహన్‌తో పెళ్లిపీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో పెళ్లికూతురిగా ముస్తాబైన దీప్తి.. సిగ్గుపడుతూ మండపంలోకి నడిచింది. పంతులు మంత్రాలు చదువుతుండగా వధూవరులు ఇద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు దీప్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దీప్తి మన్నె బెంగళూరువాసి. మొదట్లో తన మాతృభాష కన్నడలో పలు సీరియల్స్ చేసింది. అలాగే సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు ధారావాహికల్లో నటించింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది.
చదవండి: తొడకొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్.. విజయ్ దేవరకొండకు ఆర్డర్..


