చాలామందికి సినిమాలకే కాలక్షేపం. కాస్త సమయం దొరికితే చాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు. తాను కూడా అదే కోవలోకి వస్తానంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా అతడు హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ (టీపీఎల్)ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
డబ్బింగ్ మూవీస్ చూస్తా..
మీరు సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. తెలుగు, తమిళ భాషలు అర్థం కానప్పటికీ ఆయా సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చూస్తానని సెహ్వాగ్ చెప్పాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌ను హిందీలో చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాక నేను చాలా ఖాళీ సమయం దొరికింది.
నా ఫేవరెట్ హీరో
అప్పుడు నేను టాలీవుడ్ స్టార్స్ అయిన మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టాను. నా ఫేవరెట్ తెలుగు హీరో మహేశ్‌బాబు. ప్రభాస్ బాహుబలి సినిమానైతే ఎన్నోసార్లు చూశాను అని చెప్పుకచ్చొఆడు. ఇకపోతే వీరూ ఫేవరెట్ హీరో మహేశ్‌బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.
సినిమా
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రభాస్ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ప్రభాస్ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: వితికా షెరుకు ప్రమోషన్


