శ్రుతిహాసన్‌ ట్రైన్‌ వచ్చేస్తుంది.. | Vijay Sethupathi and Shruti Haasan train movie release date | Sakshi
Sakshi News home page

శ్రుతిహాసన్‌ ట్రైన్‌ వచ్చేస్తుంది..

Dec 24 2025 7:15 AM | Updated on Dec 24 2025 7:15 AM

Vijay Sethupathi and Shruti Haasan train movie release date

కోలీవుడ్‌లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం 'ట్రైన్‌'.. విజయ్‌ సేతుపతి, నటి శ్రుతిహాసన్‌ జంటగా నటించిన చిత్రం ఇది. యూగీసేతు, నరేన్, సంపత్‌ రామ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నటుడు నాజర్, వి.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్‌ దర్శకుడు మిష్కిన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈయన చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ట్రైన్‌ చిత్రం కూడా అదేవిధంగా ఉంటుందని భావించవచ్చు. ఇది విజయ్‌సేతుపతి, శ్రుతిహాసన్‌  రేర్‌ కాంబినేషన్లో రూపొందిన చిత్రం. ఇందులో విజయ్‌సేతుపతి, శ్రుతిహాసన్‌ల గెటప్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. 

శ్రుతిహాసన్‌ ఇటీవల వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్, ఆ తరువాత రజనీకాంత్‌ హీరోగా నటించిన కూలీ చిత్రాల్లో ఈమె పాత్రలు అంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ట్రైన్‌ చిత్రంలో కూడా శ్రుతిహాసన్‌ గెటప్‌ కొత్తగా ఉంది. 

ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా అప్‌డేట్‌ను యూనిట్‌ సభ్యులు వెల్లడించారు. ఈచిత్ర సింగిల్‌సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో త్వరలోనే ట్రైన్‌ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. మరో విషయం ఏమిటంటే తాజాగా విడుదలైన పాటను శ్రుతిహాసన్‌ పాడడం విశేషం.   వచ్చే ఏడాది ప్రారంభంలోనే తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement