తొడకొట్టిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. విజయ్‌ దేవరకొండకు ఆర్డర్‌.. | Vijay Devarakonda Assures He Gifts Dresses to Rahul Roy, Tweet And Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అన్నా.. హీరోయిన్‌ సైజ్‌ తెలీదు, కానీ మాకైతే రౌడీ షర్ట్స్‌ రెడీగా పెట్టుకో..

Nov 7 2025 1:47 PM | Updated on Nov 7 2025 3:45 PM

Vijay Devarakonda Assures He Gifts Dresses to Rahul Roy

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌ చేసిన రోహన్‌ (Rohan Roy).. #90's వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. తన టాలెంట్‌కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు రోహన్‌ కోసం మంచి పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారు. అలా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో ఫుల్‌ బిజీ అయ్యాడు రోహన్‌ రాయ్‌. అతడు కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ద గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో. తిరువీర్‌, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ మూవీ నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

రెడీగా పెట్టుకో..
కథపై నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌ వేశారు. సినిమా చూసినవాళ్లంతా కూడా బాగుందని పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. దీంతో మూవీ హిట్టు కొట్టేసినట్లేనని చిత్రయూనిట్‌ ఫిక్సయిపోయింది. ఈ క్రమంలో నటుడు రోహన్‌ కల్ట్‌ బొమ్మ ఇచ్చామని తొడ కొట్టి మరీ చెప్పాడు. విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) అన్నా.. నా సైజ్‌ ఎస్‌.. హీరోయిన్‌ సైజ్‌ తెలీదు. మా మొత్తం టీమ్‌కు రౌడీ షర్ట్స్‌ రెడీగా పెట్టుకో.. మేమందరం నీ దగ్గరికి వస్తున్నాం అని స్పీచ్‌ ఇచ్చాడు. 

నీ అభిమానిని: విజయ్‌ దేవరకొండ
ఇది హీరో విజయ్‌ దేవరకొండ కంటపడింది. రోహన్‌.. నీకేది కావాలంటే అది తీసుకో.. #90's: ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ సిరీస్‌ చూసినప్పటి నుంచి నీకు అభిమానిగా మారిపోయాను. త్వరలోనే కలుద్దాం. ప్రీవెడ్డింగ్‌ షో మూవీ సక్సెస్‌ అయినందుకు టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశాడు. ఇటీవల తెలుగు యూట్యూబర్‌ మౌళి హీరోగా నటించిన లిటిల్‌ హార్ట్స్‌ కూడా ఘన విజయం సాధించింది. ఆ సమయంలో హీరో విజయ్‌.. వారిని అభినందిస్తూ రౌడీ షర్ట్స్‌ బహుమతిగా ఇచ్చాడు.

 

 

చదవండి: లవ్‌ లెటర్‌ రాసిన రష్మిక మందన్నా.. నెట్టింట వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement