ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా (The Girlfriend Movie)లో నటనకు రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు జాతీయ అవార్డు రావాల్సిందే! నిన్నటివరకు ఇది అల్లు అరవింద్ మాట.. కానీ, ఈ సినిమా చూశాక చాలామందిదీ ఇదే మాట! రష్మికకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే.. అంత అద్భుతంగా నటించింది అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్.
మీ అందరికీ నా ప్రేమలేఖ
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (నవంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ లవ్ లెటర్ రాసింది. అమ్మాయిలందరికీ దాన్ని అంకితమిచ్చింది. అందులో ఏముందంటే.. స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ.. 'నీకేం తెలుసు?' అన్న ప్రశ్న ఎదుర్కొనే ప్రతి అమ్మాయి 'తనకేం కావాలో బాగా తెలుసు' అనే స్థాయికి చేరుకుంటుంది. ఈ జర్నీ చిన్నదేమీ కాదు.

ప్రేమ అంటే బంధీ అవడం కాదు
నువ్వు ఎంతోదూరం వచ్చావ్.. ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను చూసి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలు.. మీ ప్రేమ వల్లే తాను ఇంత ధైర్యంగా నిలబడగలిగింది. ప్రేమలో ఎవరూ మాట్లాడని విషయాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవడం కాదు, స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. మనసును తేలిక చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం.
మిమ్మల్ని మీరు ప్రేమించండి
నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ మనసును తాకుతుందని, మీ బలాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నాను. అదే గనక నిజమైతే నా ఆశయం నెరవేరినట్లే! నిశ్శబ్ధాన్ని చీల్చుకుని ధృడసంకల్పంతో ముందడుగు వేసేవారికి.. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారికోసమే నా ఈ ప్రేమలేఖ అని ట్వీట్ చేసింది. ఈ లవ్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
A love letter to all the girlies growing into the woman they love.
To every Girl who was told “what do you know”… and yet grew into a woman “who knows what she wants”.
You’ve come a long way, give yourself that proud, tight Hug🫂
And to the men who’ve loved, not by leading,…— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025
చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ


