టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి మాట్లాడారు. మీ బాడీ అంతా బయటికి కనపడేలా డ్రెస్సులు వేసుకోవద్దని కామెంట్స్ చేశారు. అదే సమయంలో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నటి అనసూయ సైతం శివాజీ కామెంట్స్పై స్పందించింది. ఈ బాడీ నీది కాదు.. మాది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో శివాజీ అభద్రతా భావంతో ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉందని కూడా రాసుకొచ్చింది.
అయితే ఇవాళ దండోరా టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివాజీ ఈ అంశంపై మాట్లాడారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. ఆ రెండు పదాలు వాడడం నా తప్పేనని.. నా ఉద్దేశంలో మాత్రం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. అదే సమయంలో యాంకర్ అనసూయకు కౌంటరిచ్చారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా మిమ్మల్ని అన్నానా అండి? మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు.. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.
శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. నేను చేసిన కామెంట్స్పై ఆడపడచులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్‌సెక్యూరిటీ నాలో ఉంది. మీరు నామీద జాలి చూపించారు కదా. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
అసలు శివాజీ ఏమన్నారంటే.. ?
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.
అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ?
- Actor Sivaji
pic.twitter.com/urw4aUrniQ— Telugu Chitraalu (@CineChitraalu) December 24, 2025


