దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.
శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్‌లో నిధి అగర్వాల్‌ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు.
దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలనే ప్రెస్మీట్కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు.



