బుల్లితెర నటి దీప్తి మన్నె (Deepthi Manne) పెళ్లి ఘడియలు వచ్చేశాయి. గత నెలలో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఆమె ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు రోహన్‌తో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి దీప్తి - రోహన్ జంట హల్దీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హల్దీ వేడుకలు సంతోషంగా, ఉత్సాహంగా సాగాయి.

సీరియల్స్‌తో ఫేమస్
ఈమేరకు ఓ వీడియోను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన దీప్తి మన్నె.. మొదట్లో కన్నడ భాషలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు సీరియల్స్ చేసింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది.
చదవండి: బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు


