బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు | Singer Chinmayi Sripada Files Complaint Over Online Abuse, Tags Hyderabad CP Sajjanar | Sakshi
Sakshi News home page

'పిల్లలు పుట్టొద్దు.. పుట్టినా చావాలి'.. సజ్జనార్‌కు చిన్మయి ఫిర్యాదు

Nov 6 2025 12:18 PM | Updated on Nov 6 2025 2:39 PM

Chinmayi Sripada Complaint to VC Sajjanar about Online Trolling

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) మరోసారి ట్రోలింగ్‌ బారిన పడింది. రాయడానికి, చెప్పడానికి కూడా వీలు లేని పదాలతో ఆమెను దారుణంగా తిడుతున్నారు. తననే కాకుండా, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌కు చిన్మయి ఎక్స్‌ (ట్విటర్‌)లో ఫిర్యాదు చేసింది. 

సజ్జనార్‌కు ఫిర్యాదు
'వాళ్ళు పబ్లిక్‌గా మహిళలపై మాట్లాడుతున్న భాష దారుణంగా వుంది. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్‌లో ఉన్నా ప్రొత్సహించకండి. ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. మా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకండి. అంతేకానీ, నా పిల్లలు చనిపోవాలని ఎలా కోరుకుంటారు? వీళ్లను అలాగే వదిలేయలేను. అందుకే నాపై వేధింపులను మీ దృష్టికి తీసుకొస్తున్నా..' అంటూ సజ్జనార్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. దీనిపై సజ్జనార్‌ స్పందిస్తూ.. చిన్మయి ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు.

ఏం జరిగింది?
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది నా భార్య చిన్మయి ఇష్టం. ఆ విషయంలో తనను బలవంతం చేయను అన్నాడు. ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. రాహుల్‌- చిన్మయి దంపతులను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివారికి పిల్లలు పుట్టకూడదు.. పుట్టినా వెంటనే చనిపోవాలి అని కొందరు మరీ దారుణంగా కామెంట్స్‌ చేయడంతో చిన్మయి పోలీసులను ఆశ్రయించింది.

 

 

చదవండి: 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement